*********BIRYANI LOVERS *********Oil Less Chicken biryani || Famous Biryani in Andhra Pradesh || Khaja BiryaniYou might have tasted the Best Biryanis in and Around your Place, But Have you tried NO OIl / NO GHEE Biryani .Yes !!!! Ramu from Khaja (Village) in West Godavari District, Andhra Pradesh, India cooks his special recipe with NO OIL/ GHEE in it. The Best Part this Biryani is Served with Katta which is similar to Sambar.So Guys if you are in Godavari Districts dont miss to try this place . Its a Must Visit for having Some Piping Hot Biryani .My Rating for thisOil Less Biryani- 4.5/5 #Biryani #chickenBiryani #Andhrapulao #pulao #palakollu #streetfood #indianfood #food #Bhimavaram #dhindiresorts భోజన ప్రియులు నందు బిర్యాని ప్రియులు వేరు బాబాయ్ !!!!!!మీరు ఎప్పుడన్నా ఆయిల్ లేకుండా బిర్యాని చేస్తారు అని కల లో అయినా ఊహించారా . వీడు ఏంటీ ఆయిల్ లెస్ బిర్యాని అంటున్నాడు అనుకుంటున్నారా నన్ను నమ్మకపోతే మన streetbyte వీడియో ని చూడండీ .పశ్చిమ గోదావరి జిల్లా లో పాలకొల్లు నుంచి రాజోలు వెళ్తుంటే కాజా అని ఒక ఊరు ఉంది అండీ . ఈ ఊరు చాలా మంది మన బిర్యాని ప్రియులకి సుపరిచితమే . అక్కడ మన రాము గారు ఆయిల్ లెస్ బిర్యాని చెయ్యడం లో నిష్ణాతులు .విచిత్రం అయినా విషయం ఏమిటి అంటే Dum బిర్యాని లో టొమాటో లు వెయ్యడం, ఆయిల్ / నెయ్యి వాడక పోవడం , Dum కోసం మైదా పిండి పెట్టక పోవడం, రైస్ లో బిర్యాని సరుకులు ఏమి వేయకపోవడం. మీరు ఎప్పుడన్నా Dum బిర్యాని తిన్నపుడు ముక్క బాగా మెత్త గా ఉంటది కానీ మన కాజా బిర్యాని లో ముక్కలు మంచి crisp గా ఉంటాయి అండీ.నాకు ఈ కాజా బిర్యాని బంధం ఇప్పటిది కాదులెండి , నేను స్వర్ణాంధ్ర కాలేజ్ లో చదువుకునే రోజులు నుండి మహా ఇష్టం అయినా బిర్యాని ల లో ఇది ఒకటి . ఈ కాజా బిర్యాని గురించి కథలు కథనాలు విన్నాకా తినాలి అని Fix అయ్యాను . అప్పట్లో అంటే 2006 లో ఏ బిర్యాని దొరకడం అంత ఈజీ కాదు అండీ . ఆర్డర్ మీద మాత్రమే చేసేవారు మనకి బిర్యాని కావాలి అంటే పొద్దున 10 లోపు వల్ల Land లైన్ కి కాల్ చేసి మన ఆర్డర్ ఇవ్వాలి . ఆర్డర్ ని అబ్బులు అనే Manager నోట్ చేసుకునేవాడు. మొత్తానికి ఒక రోజున నేను Ramesh Varma Bhupathiraju అని నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి parcel తెచ్చుకుంటానికి Share Auto లు RTC bus లు ఎక్కి కాజా కి వెళ్ళాము . వెళ్లి చూస్తే ఏదో Rich జాతర జరుగుతున్నట్టు పెద్ద పెద్ద car లు బయట వున్నాయి . అంటే ఏ బిర్యాని బడా బాబులకు కుడా ఇష్టమే అనమాట అని నేను మా రమేష్ గాడు అనుకున్నాం . సరే మొత్తానికి ఏదో ఒలింపిక్ మెడల్ ని సాధించినట్టు నేను మా వాడు ఫీల్ అయ్యి మళ్ళీ Share ఆటో లు RTC bus లు ఎక్కి భీమవరం చేరుకున్నాం అండీ . నాకు ఏమో ఒకటే ఆత్రం త్వరగా తినాలి అని మొత్తానికి బిర్యాని తిన్నాక , బిర్యాని బాగుండి అని అనిపించిండీ కాకపోతే బిర్యాని తో పాటు ఇచ్చిన కట్టా తో తింటే మాత్రం ఆహా నా రాజా అనిపించింది, అప్పట్నుంచి ఒకసారి కాదు రెండు సార్లు కాదు బిర్యాని తినాలి అంటే పనికట్టుకుని బండి వేసుకుని వెళ్ళేవాళ్ళం . 2008 2009 ప్రాంతం లో చిన్న సిట్టింగ్ లాగా ఏర్పాటు చేశారు అక్కడ . అప్పట్లో Ravi Shankar , Rajesh Balu Balla లతో కలిసి ఆదివారం వస్తే అక్కడే కూర్చునే వాళ్ళం దశల వారి గా బిర్యాని లో కట్టా వేసుకుని తింటూ పక్కన వున్న రొయ్యల చెరువుల్ని చూస్తూ ఉంటే బడే వుండేదండి . మొత్తానికి మళ్ళీ మొన్న ఇన్ని సంవత్సరాలు తరువాత మళ్ళీ కాజా వెళ్ళాను ఈసారి వీడియో చేదాం అని . కాకపోతే నాకు తెలిసిన లాండ్ లైన్ number పని చెయ్యడం లేదు . ఎలాగ అని FB లో పోస్ట్ చేస్తే క్రాంతి అని నా కాలేజ్ సీనియర్ Kranti Kishore Degala మొత్తానికి ఫోన్ Number కనుక్కుని ఇచ్చాడు . వెళ్ళాక రాము గారు నన్ను గుర్తు పట్టి చాలా సంతోషం అండీ చాలా రోజుల తరువాత వచ్చారు అని కాజా బిర్యాని అదే అండీ ఆయిల్ లెస్ బిర్యాని ని మన #streetbyte కోసం చేసి చూపించారు . అదే రుచి అదే కట్టా అదిరిందయ్ అండీ బిర్యాని మాత్రం.సో నేను చెప్పదలిచినది ఏంటీ అంటే మీరు కానీ భీమవరం, పాలకొల్లు, నర్సాపురం, రాజోలు వెళ్తే మాత్రం తప్పకుండా తినాల్సిన బిర్యాని మాత్రం మన కాజా బిర్యాని.---- రవితేజ రావూరి .Some other popular Street foods#Noodels ( #ChowMein )#Dosa#MasalaDosa#OnionDosa#ChickenRoll#Laddu#Biryani#pot Biryani#Hyderabadi Biryani#pulav#Andhra Biryani#Pizza#jalebi#paratha#lacha Paratha#Sweet pan#Bread Omellete#bbq#kanji vada#mixture#panipoori#pistahouse#Haleem#veg#sandwich#Grilled Sandwich#pizza Dosa#paneer Dosa